ఇలాంటి సభను ఎక్కడా చూడలేదు: వైఎస్ జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి సభను ఎక్కడా చూడలేదని అన్నారు. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా సభను అన్యాయంగా నడుపుతున్నారని అన్నారు. కాగా, గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షం పట్టుబట్టింది.
ప్రభుత్వం అందుకు విముఖత చూపడంతో స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.