
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విశాఖలో పర్యటించనున్నారు. రూ.1300 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ విభాగాలకు చెందిన 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. అమృత్ పథకం కింద 40వేల హౌస్ సర్వీస్ కనెక్షన్లను సీఎం చేతుల మీదగా అందజేస్తారని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఆర్కే బీచ్‌ను మెరుగుపరిచే పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టిన ముడసర్లోవ రిజర్వాయర్‌లో శాశ్వత ప్రాతిపదికన పూడికతీత తీసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment