
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment