
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019.. తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సంపద సమృద్ధిగా కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవా రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారితీయాలని జగన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందుతుంద ని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి మనసును స్పృశించేలా ఉంటాయని పేర్కొన్నారు.