పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ కు మాత్రమే చోటు: జగన్
నెల్లూరు: పేదవాడి మనసెరిగిన నాయకుడ్ని సీఎంగా ఎంచుకోండని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలిలో వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు ముందు చాలా మంది ముఖ్యమంత్రలను చూశాం. కాని ఒక్క వైఎస్ఆర్ మాత్రమే పేదవాడి గుండెల్లో ఉండిపోయారు అని అన్నారు.
వైఎస్‌ఆర్ విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచారని, మహానేత వైఎస్ వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లో విశ్వసనీయతకు స్థానం లేకుండా పోయిందన్నారు. తమ పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకుంటున్నప్పుడు చంద్రబాబు ఎక్కడికెళ్లావు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
వైద్యానికి డబ్బులు లేక పేదలు బాధపడుతున్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడని వైఎస్ జగన్ నిలదీశాడు. మహానేత వైఎస్ పేదలకు ఉచిత వైద్యం సదుపాయం కల్పించారని జగన్ గుర్తు చేశారు. సాధ్యం కాని హామీలిస్తూ పట్టపగలు మోసం ప్రజల్ని చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు, తన 9ఏళ్ల పాలనలో ఉద్యోగులను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు.