ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి అన్నారు. గురువారం ఆమె ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నర్తు రామారావుతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ఆ పథకాలు అమలు జరగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ప్రజలను కోరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదేనని నర్తు రామారావు అన్నారు. డొంకూరులో మహిళలు వారికి హారతుల్చి స్వాగతం పలికారు. మత్యకార మహిళలను ప్రచార రథం ఎక్కించి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి బూర్జపాడు చేరుకున్నారు. రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయాలని ప్రజలను కోరారు. సన్యాసిపుట్టుగ,కేశుపురంలోను పర్యటించారు. కోఠారి గ్రామం వద్ద ఆమె మహిళలతో ముచ్చటించారు.మహిళలు తమ కష్టాలను వివరించగా. రాజన్య రాజ్యం వస్తుందని,అందరి కష్టాలు,సమస్యలు తీరిపోతాయని ఆమె వివరించారు. అనంతరం ఇన్నీసుపేట,బలరాంపురంగ్రామాల్లో పర్యటించారు.బలరాంపురంలో ఇంటింటికి వెళ్లి మహిళలను,వృద్ధులను, పలకరించారు.
ఆకట్టుకున్న బైక్ ర్యాలీ
ఎంపి అభ్యర్థి రెడ్డి శాంతి పర్యటన సందర్భంగా పార్టీ నాయకుడు నరేంద్రయాదవ్ ఆధ్వర్యంలో 200 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురంలో ప్రారంభమైన ఈ ర్యాలీని రెడ్డి శాంతి ప్రారంభించారు.పార్టీ నాయకులు జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, జిల్లా మైనార్టీ సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ పాఢి, పార్టీ వివిధ విభాగాల కన్వీనర్లు పి.కోటిరెడ్డి, ఎం.వెంకటరెడ్డి,సర్పంచ్‌లు నీలాపు చంధ్రయ్య,బి.కామాక్షి,సంతోష్, నాయకులు ఉప్పాడ చినబాబు,కాళ్ళదేవరాజ్,ప్రేమ్ కుమార్, పి.విజయభాస్కర్, బి.జానకిరావు,బడ్డు కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
Published Fri, May 2 2014 1:43 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement