ముస్లింల కోసం ఆ దేవుడే పంపిన గిఫ్ట్.. వైఎస్ | YS that God sent gift for the Muslims .. | Sakshi
Sakshi News home page

ముస్లింల కోసం ఆ దేవుడే పంపిన గిఫ్ట్.. వైఎస్

Published Wed, Sep 2 2015 2:26 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ముస్లింల కోసం ఆ దేవుడే పంపిన గిఫ్ట్.. వైఎస్ - Sakshi

ముస్లింల కోసం ఆ దేవుడే పంపిన గిఫ్ట్.. వైఎస్

‘క్యా నవాబ్... క్యా జనాబ్! అని ముస్లింలను ఉద్దేశించి నవ్వుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పలకరించే మాటలు చెవుల్లో ఇప్పటికీ గింగురుమంటూనే ఉన్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు ఎప్పటికీ మరువలేని వ్యక్తి ఆయన . నిరంతరం లబ్ధి చేకూరే విధంగా రిజర్వేషన్లను కల్పించడం ముస్లింలకు ఆయన చేసిన మహోపకారం. కడపలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం, వారిలోనూ పేదలే ఎక్కువగా ఉండటమే ఆయనను వారి పట్ల ఎక్కువగా ఆలోచింపజేసింది. 2004 ఎన్నికల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చాక విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం కల్పించారు.

ఏటా సుమారు 64 మంది ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులను అభ్యసిస్తున్నారు. రిజర్వేషన్ కోటాలో మెడిసిన్‌లో తొలి సీటు దక్కించుకున్న విద్యార్థిని తీసుకుని నేను వైఎస్ వద్దకు వెళ్లినపుడు ఆయన ఎంతగా మురిసిపోయారో. ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాల్సి వస్తే.. ‘ముస్లింల కోసం ఆ దేవుడే పంపిన బహుమతి వైఎస్’ అంటాను.
 
 -హెచ్.సలీం బాషా, హజ్ కమిటీ రాష్ట్ర మాజీ సభ్యులు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement