రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేట, తిరుమలగిరి, గౌరావరం, ముళ్లపాడులో వైఎస్ విజయమ్మ పర్యటిస్తారు.
అనంతరం నందిగామ మండలం రాఘవాపురం, వీరులపాడు మండలం జగన్నాథపురం వెళ్లనున్నారు. అక్కడ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయుల బాధితులతో వైఎస్ విజయమ్మ స్వయంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటారు. అలాగే పంటలు దెబ్బతిన్న రైతులతో కూడా వైఎస్ విజయమ్మ మాట్లాడుతారు.