లాల్జాన్ బాషా మృతి పట్ల విజయమ్మ దిగ్బ్రాంతి | YS Vijayamma shock over the death of Lal jan basha | Sakshi
Sakshi News home page

లాల్జాన్ బాషా మృతి పట్ల విజయమ్మ దిగ్బ్రాంతి

Published Thu, Aug 15 2013 12:40 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

YS Vijayamma shock over the death of Lal jan basha

తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షుడు లాల్జాన్ బాషా ఆకస్మిక మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన లాల్జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించడం తన మనసుసు కలిచివేసిందని తెలిపారు.

మైనార్టీల అభ్యున్నతికి ఆయన  అంకితభావంతో విశేషమైన కృషి చేశారని చెప్పారు. పార్లమెంట్లో ఇరుసభలకు ఎన్నికై పలు ప్రజా సమస్యలపై స్పందించి ప్రజాహిత రాజకీయాల్లో కొనసాగారని విజయమ్మ వివరించారు. లాల్జాన్ బాషా కుటుంబసభ్యలకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తు లాల్జాన్ బాషా ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ను డీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement