అనంతపురం: టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు రక్తంతో తడిశాయని అన్నారు.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల ప్రోద్భలంతోనే తాడిపత్రిలో దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పారు. టీడీపీ నేతలు వీరాపురం దళితులపై దాడి చేయడం అమానుషమని అన్నారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జేసీ సోదరులు ప్రతిగ్రామంలో చిచ్చుపెడుతున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు విమర్శించారు.
వైఎస్ జగన్ను ఎదుర్కోలేకే కార్యకర్తలపై దాడులు
Published Mon, Oct 20 2014 7:06 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement