వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో జిల్లా నుంచి ఇద్దరి కి చోటు లభించింది. నెల్లిమర్ల నియోజకవర్గ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు,
వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యులుగా కాకర్లపూడి, శ్రీవాణి
Jan 19 2014 3:10 AM | Updated on May 25 2018 9:12 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో జిల్లా నుంచి ఇద్దరి కి చోటు లభించింది. నెల్లిమర్ల నియోజకవర్గ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు, పార్వతీపురం నేత కొయ్యాన శ్రీవాణిని సీఈసీ సభ్యులుగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర విభాగం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసరాజు పార్టీ ఆవి ర్భావం నుంచి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా రు. పార్టీ కోసం పనిచేసే వ్యక్తికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే కొయ్యాన శ్రీవాణి కూడా పార్వతీపురంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్నారని ఆమె సేవలను అధిష్ఠానం గుర్తించిందం టూ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
Advertisement