Sri Vani
-
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై లింగస్వామి కథనం ప్రకారం... మంచాల మండలం బండలేమూర్ గ్రామ సర్పంచ్ పోచమోని కృష్ణ కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అతని కూతురు శ్రీవాణి(22) బొంగులూర్ గేట్ వద్ద గల జేఎన్ఐటీలో ఇంజినీరింగ్(ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతోంది. ఒంట్లో బాగలేకపోవడంతో గత మూడునాలుగురోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఏమైందో తెలీదుకానీ మంగళవారం శ్రీవాణి ఇంట్లోనే చున్నీతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బుల్లితెర నటిపై కేసు నమోదు
హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్‌పై కేసు నమోదు చేశారు. తమ ఇల్లు కూలగొట్టిందని శ్రీవాణిపై ఆమె వదిన అనూష పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిని కాజేయాలని శ్రీవాణి చూస్తోందని అనూష పోలీసులకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. -
మహిళలపై వేధింపులకు శ్రీవాణియే నిదర్శనం
కశింకోట: మహిళలపై వేధింపులు జరుగుతున్నాయన్న దానికి శ్రీవాణియే నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక గవరపేట కనకమహాలక్ష్మి వీధిలో అత్తింటివారు కాపురానికి రానీయకపోవడంతో రామాలయంలో తలదాచుకుంటున్న భీశెట్టి శ్రీవాణిని సోమవారం ఆయన పరామర్శించారు. ఆమెకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీవాణికి అండగా ఉంటాం శ్రీవాణికి అండగా నిలిచి న్యాయం చేయడానికి కృషి చేస్తామని అమర్నాథ్ భరోసా ఇచ్చారు. 15 ఏళ్ల కిందట పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న శ్రీవాణిని భర్త, అత్తింటి వారు ఇంట్లోకి రానీయకుండా ఇబ్బందులు పెడుతుండటం శోచనీయమన్నారు. కనీసం పిల్లలను కూడా చూసే అవకాశాన్ని కల్పించకపోవడం సమంజసం కాదన్నారు.ఈ విషయమై పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కాపురానికి వచ్చిన భార్యను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటే చుట్టు పక్కల మహిళలు చేరదీయడం అభినందనీయమన్నారు. శ్రీవాణిని రెండు రోజుల వ్యవధిలో కాపురానికి తీసుకెళ్లాలని భర్త తారకేశ్వరరావుకు నచ్చజెబుతానన్నారు. లేదంటే స్థానికుల అండతో ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణికి న్యాయం చేకూరుస్తామని అమరనాథ్ పేర్కొన్నారు. కన్నీళ్ల పర్యంతమైన శ్రీవాణి కాపురానికి వచ్చిన తనను భర్త, అత్తింటివారు ఇంట్లోకి రానీయలే దని, కనీసం పిల్లలను కూడా చూడనీయలేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.అదనపు కట్నంగా భూమి రాయమని భర్త,అత్తింటి వారు వేధిస్తున్నారని, భూమి కోసం తన తల్లిని కొటి ్ట చంపినంతటి పని చేశారని ఆమె ఆరోపించారు. దీంతో కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. తనకు ప్రస్తుతం ఏ దిక్కూలేదని, కాపురం ముఖ్యమని, తన ను కాపురానికి తీసుకెళ్లి పిల్లలను చూపిస్తే కేసులను ఉపసంహరించుకుంటానన్నారు. తన కాపురాన్ని నిలిపి న్యాయం చేయాలని శ్రీవాణి కన్నీళ్లతో అమర్నాథ్ను అభ్యర్థించారు. అమర్నాథ్ వెంట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబు, ఆర్ఈసీఎస్ డెరైక్టర్ పెంటకోట శ్రీనివాసరావు, జగన్ తదితరులు ఉన్నారు. -
వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యులుగా కాకర్లపూడి, శ్రీవాణి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో జిల్లా నుంచి ఇద్దరి కి చోటు లభించింది. నెల్లిమర్ల నియోజకవర్గ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు, పార్వతీపురం నేత కొయ్యాన శ్రీవాణిని సీఈసీ సభ్యులుగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర విభాగం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసరాజు పార్టీ ఆవి ర్భావం నుంచి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా రు. పార్టీ కోసం పనిచేసే వ్యక్తికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే కొయ్యాన శ్రీవాణి కూడా పార్వతీపురంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్నారని ఆమె సేవలను అధిష్ఠానం గుర్తించిందం టూ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.