వైఎస్సార్ సీపీదే అధికారం | ysr Congress party form the government | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీదే అధికారం

Published Tue, Dec 31 2013 2:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ysr Congress party  form the government

విజయనగరం టౌన్/బొబ్బిలి, న్యూస్‌లైన్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ లో చేరిన తరువాత మొదటిసారిగా సోమవారం ఆయ న జిల్లాకు వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ యువజన విభాగం కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాం ధ్ర కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కలిసి పని చేస్తున్నందుకు ఆనం దంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు విభజనకు ఆజ్యం పోశారన్నారు. అధికారులు, నాయకులు ప్రజా సంక్షేమం గు రించి ఆలోచించాలని, లేకపోతే ప్రజలు హర్షించరన్నారు. సమైక్య ద్రోహులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో మంత్రి బొత్స కుటుంబసభ్యుల అక్రమాలకు అడ్డుఅదు పు లేకుండాపోతోందన్నారు.
 
జిల్లాలో సమైక్యాంధ్ర ఉ ద్యమం చల్లారి పోయిందని పుకార్లు వస్తున్నాయని అది సరైంది కాదన్నారు. కేవలం బొత్స ఆస్తుల రక్షణ కోస మే కర్ఫ్యూ, 144 సెక్షన్, సెక్షన్ 30 వంటి చట్టాలను అమలు చేశారని ఆరోపించారు. పార్టీ జిల్లా క న్వీనర్ పెనుమత్స సాంబశివరాజు మాట్లాడు తూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకు ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  సమైక్య రా ష్ట్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గాల సమన్వయకర్తలుఅవనాపు విజయ్, బోకం శ్రీనివాస్, వేచలపు చినరామునాయుడు, డాక్టర్ గేదెల తిరుపతి, కొయ్యాన శ్రీవాణి, మీ సాల వరహాలనాయుడు, శనపతి సిమ్మునాయుడు, పార్టీ నాయకులు డాక్టర్ సురేష్‌బాబు,  కాళ్ల గౌరీశంకర్,  కోళ్ల గంగాభవానీ, మక్కువ శ్రీధర్, డాక్టర్ ఎస్.పెద్దినాయుడు, జరజాపు ఈశ్వరరావు, గండికోట శాంతి, మజ్జి త్రినాథ్, సీహెచ్.ఉగ్రనరసింగరావు, నామాల సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
 
బొబ్బిలి దర్చార్‌లో..
బొబ్బిలి దర్బార్ మహాల్‌లో వైఎస్సార్ సీపీ అరుకు పా ర్లమెంట్ పరిశీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) పూలమాల, పార్టీ కండువా వేసి రాజన్నదొర కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు వైఎ స్సార్ సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ కా ర్యక్రమంలో సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల సమన్వయకర్తలుగరుడబిల్లి ప్రశాంత్‌కుమార్, జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, సూరిబాబు, పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ తూముల రాంసుధీర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బేతనపల్లి శివున్నాయుడు, మాజీ అర్బన్ బ్యాంకు అధ్యక్షుడు గునాన వెంకటరావు, డాక్టరు బొత్స కాశీనాయుడు,తదితరులు పాల్గొన్నారు. 
 
క్యాడర్‌లో ఆనందం
సాలూరు : రాజన్నదొరకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుమారు వందకు పైగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘల ప్రతినిధులు, వేగావతి వంతెన వద్దకు వెళ్లి ఆయనకు సాదారంగా స్వాగతం పలికారు. అనంతరం బోసుబొమ్మ కుడలికి చేరుకున్న రాజన్నదొర సుభాస్ చంద్రబోస్ విగ్రహానికి పూల మాల వేశారు. ఆ తరువాత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం శ్యామలాంబ అలయానికి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేశారు. సాలూరు, మెంటాడ,పాచిపెంట, మక్కు వ, రామభద్రపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున కా ర్యకర్తలు తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సం దర్భంగా పాచిపెంట సర్పంచ్ ధెరీసమ్మ పార్టీలో చేరా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె మధు, డోల బాబ్జి, యుగంధర్, రాము, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement