వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం | ysr congress party get whip power | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం

Published Mon, Jun 30 2014 1:42 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం - Sakshi

వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం

* రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్
* గుర్తింపు పొందిన రాష్ట్రస్థాయి పార్టీల జాబితాలో వైఎస్సార్ సీపీ
* జూలై 3 నుంచి ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు
 
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల మేయర్, చైర్‌పర్సన్, అధ్యక్షుడు తదితర పదవులకు జరగనున్న పరోక్ష ఎన్నికల సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఆ పార్టీకి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 3వ తేదీ నుంచి మూడురోజుల పాటు స్థానిక సంస్థల సారథుల ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ జారీ చేసిన నోటిఫికేషన్ (నంబరు 1527/ఎస్‌ఈసీ-ఎల్/2014, తేదీ: 27.06.2014)లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీగా పరిగణిస్తూ.. ఆ మేరకు నోటిఫికేషన్ అనుబంధ జాబితాలో పార్టీ పేరును పొందుపరిచారు. మొత్తం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 16 ఉండగా అందులో ఆరు జాతీయ, రెండు రాష్ట్ర స్థాయి, మరో ఆరు ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర స్థాయి పార్టీలుగా ఈ నోటిఫికేషన్‌లో కమిషన్ పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని కొంతకాలం కిందటే పార్టీని గుర్తింపు పొందిన  పార్టీగా పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం రెండూ ఆదేశాలు జారీ చేశారుు. ఆ ప్రకారమే గుర్తింపు పొందిన రెండు రాష్ట్ర రాజకీయ పార్టీల్లో వైఎస్సార్‌సీపీని చేర్చుతూ నోటిఫికేషన్ ఇచ్చారు.

జిల్లా నేతల్లో ఒకరికి విప్ అధికారం
ఆయా జిల్లాల్లో, మండలాల్లో, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎవరికి ఓటు వేయూలో పేర్కొంటూ విప్‌ను జారీ చేసే అధికారాన్ని ఆయా జిల్లా నేతల్లో ఒకరికి వైఎస్సార్‌సీపీ ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement