
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నిజాపట్నంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ గర్ల్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సరావుపేట అంబేద్కర్ స్కూల్‌లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పెనుమాములిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(ఆర్కే), తెనాలి కోగంటి శివయ్య హైస్కూల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు రూరల్ మండంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment