పండగ నాడూ పోరు | YSRC stages protests in Vizianagaram for Samaikyandhra | Sakshi
Sakshi News home page

పండగ నాడూ పోరు

Published Fri, Nov 8 2013 3:10 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

YSRC stages protests in Vizianagaram for Samaikyandhra

చీపురుపల్లి, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం తెల్లవారక ముందే సమైక్య నినాదాలు వినిపించారు. జై జగన్.. జై సమైక్యాంధ్ర అంటూ..., తెలంగాణ వద్దని కోరుతూ నినాదాలు చేస్తూ రోడ్లను దిగ్బంధించారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో గురువారం ఉదయం నాలుగు గంటల నుంచి నాయకులు, కార్యకర్తలు రెండో రోజు రహదారులను దిగ్బంధించారు.  పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, మాజీ మున్సిపల్ చైర్మన్, అరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన నేతృత్వంలో  వాహనాలను రహదారులకు అడ్డంగా పెట్టి ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనా లు నిలిచిపోయాయి. రామభద్రపురం, పార్వతీ పురం వైపు వెళ్లే రోడ్లు దిగ్బంధం కావడంతో ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పెట్రోలు, గ్యాస్ వంటి వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. 
 
 36వ నంబరు రాష్ట్రీయ రహదారిపై బైఠాయించిన నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే నాగుల చవితి పండగను దృష్టిలో పెట్టుకొని భక్తులు సౌకర్యార్థం వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు 11 గంటల నుంచి వాహనాలను విడిచి పెట్టారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు సమైక్య ఆందోళన నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా రహదారికి అడ్డంగా కుర్చీలు వేసుకొని కూర్చుని సమైక్య వాణిని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించారు. అయితే వాహనచోదకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి రహదారిపై నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ... వాహనాలను దారి మళ్లించేందుకు పోలీసులకు సహకరించారు. ఎటువ ంటి వివాదాలకు తావివ్వకుండా  కార్యకర్తలంతా సంయమనం పాటించారు. ముగింపు సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బేతనబిల్లి శివున్నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
 పార్వతీపురం నియోజకవర్గంలోని వెంకంపేటగోళీలు వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, గర్భాపు ఉదయభానులు ఆధ్వర్యంలో ఉదయం 7.30 గంటలు నుంచి 10.30 గంటలు వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటలు నుంచి రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని కొనసాగించారు. సీతానగరం మండల కేంద్రం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రహదారిని దిగ్బంధించారు. సాయంత్రం నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, గర్భాపు ఉదయభాను, జమ్మాన ప్రసన్నకుమార్‌లతో పాటు కొయ్యాన ఆనందరావును 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పార్టీ నాయకులు గులిపల్లి సుదర్శనరావు, బొత్స ఇందిరలు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం నిర్వహించారు. దీంతో సరిహద్దులో దాదాపు పది కిలోమీటర్లు మేరకు వాహనరాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. గరుగుబిల్లి మండలంలో ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలోను, పెదమేరంగిలో మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
 
 ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దత్తి లక్ష్మణరావు, రెడ్డి శకుంతలమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే గజపతినగరంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు.ఎస్.కోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలోని చింతలపాలెం-జంగాలపాలెం మధ్య నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మహిళలతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రహదారి దిగ్బంధం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వేచలపు వెంకటచినరామునాయుడు, పార్టీ నాయకులు అప్పారావు, మాధవరావు, శంకర్, సంతు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలంలోని బొండపల్లి జంక్షన్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త శనపతి శిమ్మినాయుడు ఆధ్వర్యంలో వంద మంది మహిళలతో రహదారిని దిగ్బంధించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement