సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో ఈ నెల 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు జరగుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ శాసనసభా సమావేశాలకు సంబంధించిన తదుపరి వ్యూహం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. బడ్జెట్‌పై ప్రసంగం సందర్భంగా రైతుల సమస్యలను ప్రస్తావించడానికి జగన్‌ను అనుమతించక పోవడం దరిమిలా ఆయనతో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
అదే రోజు రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకుని ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాసతీర్మానం నోటీసును కూడా ఇచ్చారు. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ఉదయం జరుగనున్న శాసనసభాపక్షం సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
23న వైఎస్సార్ సీఎల్పీ సమావేశం
Published Sun, Mar 22 2015 8:52 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement