
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ సమైక్య పరుస్తూ ఫిబ్రవరి 17న బీసీ గర్జన సభ నిర్వహణ సందర్భంగా ఆ పార్టీ నేతలు బుధవారం పోస్టర్ విడుదల చేశారు.
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ సమైక్య పరుస్తూ ఫిబ్రవరి 17న బీసీ గర్జన సభ నిర్వహణ సందర్భంగా ఆ పార్టీ నేతలు బుధవారం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సభ ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావు పూలె పేరు పెట్టామని, ‘బీసీ గర్జన’లో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. 13 జిల్లాల బీసీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని, బీసీల జీవన ప్రమాణం పెంచేందుకు వైఎస్ జగన్ గర్జన సభ ద్వారా స్పష్టత ఇవ్వనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కాగా పార్టీ అధ‍్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పార్టీ బీసీ నేతలతో సమావేశం అయ్యారు. బీసీ డిక్లరేషన్‌తో పాటు సభ ఏర్పాట్లపై ఆయన చర్చించారు.