సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరు అయ్యారు. బీసీ గర్జన సభ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్, గర్జన సభ గురించి నేతలతో ఆయన చర్చిస్తున్నారు. కాగా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ సమైక్యపరుస్తూ ఫిబ్రవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించనున్న విషయం తెలిసిందే.
బీసీలను అన్ని విధాలా ఆదుకొనేందుకు, వారి ఉన్నతి కోసం చేపట్టబోయే అనేక కార్యక్రమాలను ఈ గర్జన సభలో వైఎస్ జగన్ ప్రకటించనున్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆయన.. ఏడాది క్రితం బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి బీసీ వర్గాల ప్రజల బాధలు, ఇబ్బందులను తెలుసుకొని.. వారి స్థితిగతులపై సమగ్ర నివేదికను తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment