మృతుల కుటుంబాలకు సాయం అందజేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, సంగారెడ్డి: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాద బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులకు రూ.50 వేలు, గాయపడినవారి కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ‘జగనన్న మీ కుటుం బాలకు అండగా ఉంటాడు.. ఎవరూ అధైర్యపడొద్డు.. మీ కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
మృతుల కుటుం బాల్లో ఒకరికి రైల్వేశాఖలో ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదస్థలిలో విద్యార్థుల సంస్మరణార్థం ‘స్మ ృతివనం’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన డ్రైవర్ భిక్షపతిగౌడ్, ఘనాపూర్ గ్రామానికి చెందిన క్లీనర్ రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అక్కడే ఆర్థిక సహాయం అందించనున్నారు.
రైలు ప్రమాద బాధితులకు వైఎస్సార్ సీపీ అండ
Published Wed, Jul 30 2014 12:23 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement