
'ఆరు నెలల నుంచి ముద్రిస్తే..ఆ సంతకం ఎలా?'
తిరుపతి : రూ.500, 1000 నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణమే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో సోమవారం ఆయన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిత్యావసరాల కోసం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొత్త నోట్లను ఆరు నెలల నుంచి ముద్రిస్తున్నామని కేంద్రం చెబుతున్నారు...రెండు నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఆ నోట్లపై ఎలా ఉందో చెప్పాలని భూమన ప్రశ్నించారు.