బొబ్బిలి, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం రాత్రితో ముగిసింది. సుజయ్, తదితరులతో పార్టీ నాయకులు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు జరిగిన శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, సమైక్యవాదులు వచ్చి సుజయ్‌కు సంఘీభావం తెలియజేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో శిబిరం హోరెత్తిపోయింది. సుజయ్‌కృష్ణ రంగారావుతో పాటు రామభద్రపురం మండలానికి చెందిన పురోహితుడు, బొబ్బిలి రాజులు, వైఎస్ వీరాభిమాని డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయలు కూడా నిరవధిక దీక్షను కొనసాగిస్తున్నారు.
వీరితో పాటు రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన గొర్లె రామారావు, బొబ్బిలి పట్టణానికి చెం దిన సామోటి గురునాయుడు, కలవపల్లి రామారావు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. సుజయ్‌కృష్ణ రంగారావు కుమారుడు విశాల్ గోపాల్‌కృష్ణ రంగారావు, బేబీనాయన కుమార్తె మేథ జాహ్నవిలు శిబిరంలో కూర్చుని పలువురిని ఆకట్టుకున్నారు. సుజయ్, రాయలకు వైద్యులు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలోనే ధ్యానం
బుధవారం ఉదయం నిరవధిక దీక్షలో కూర్చున్న సుజయ్ గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అరగంట కాలం పాటు శిబిరంలోనే ధ్యానం చేశారు. అనంతరం కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, అరుకు పార్లమెంట్ పరిశీలకుడు బేబీ నాయన, నాయకులు పెనుమత్స సురేష్‌బాబు, గొర్లె వెంకటరమణ, జనాప్రసాద్, ఆదాడ మోహనరావు, చెన్నా లక్ష్మి, ఆర్ రమేష్‌బాబు( చినబాబు), రాయల సుందరరావు, తమ్మినాయుడు, తుమ్మగంటి సూరినాయుడు, మక్కువ శ్రీధర్‌తో పాటు బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అలాగే తెర్లాం మండలానికి చెందిన నర్సుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు .. పాఠశాలల విద్యార్థులు, ఏపీఎన్‌జీఓ జేఏసీ నాయకులు చందాన మహందాతనాయుడు, సురేష్, మున్సిపల్ జేఏసీ కన్వీనర్ పి. సురేష్‌బాబు, వాకడ గణపతి, ప్రవీణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు.
మిన్నంటిన సమైక్య నినాదం
Published Fri, Oct 4 2013 3:15 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement