
వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌తో పొత్తులేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతున్నట్టు పేర్కొన్నారు. దేవుడు ఆశీర్వదించి, అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలో 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకే దక్కితే, ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన తర్వాతే కేంద్రంలో ఉన్న ఏపార్టీకైనా మద్దతు తెలుపుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment