'ఎమ్మెల్యేల ఫోన్లు లిప్ట్ చేయకుండా అవమానిస్తారా' | ysrcp mlas slams ysr district collector over vigilance and Monitoring Committees | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేల ఫోన్లు లిప్ట్ చేయకుండా అవమానిస్తారా'

Published Wed, Jul 1 2015 1:19 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

'ఎమ్మెల్యేల ఫోన్లు లిప్ట్ చేయకుండా అవమానిస్తారా' - Sakshi

'ఎమ్మెల్యేల ఫోన్లు లిప్ట్ చేయకుండా అవమానిస్తారా'

కడప:  కడప జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ  సమావేశంలో కలెక్టర్పై .. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. జిల్లా ప్రగతిని పట్టించుకోకపోగా ...ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఎత్తకుండా కలెక్టర్ తమను అవమానపరుస్తున్నారని వారు ఆరోపించారు.  అభివృద్ధికి అడ్డం పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారమిక్కడ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తమను ఘోరంగా అవమానిస్తున్నారన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్గా స్థానిక లోక్సభ సభ్యుడిగా ఉన్న తనను కేంద్రం నియమించిందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఏపీకి సంబంధం లేని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను ఛైర్మన్గా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా అవమానించడమే అని వైవీ అవినాష్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement