
'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి'
తిరుపతి: రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే నగరంలోని అనేక సమస్యలు పరిష్కారించామన్నారు.
తిరుపతి నుంచి షిర్డికి ప్రత్యేక రైలు వేయించినట్లు వరప్రసాద్ చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నడికుడి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఆయన అన్నారు.