
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుపుగొండి చర్యలతో మరింత పతనమవుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆయన శుక్రవారం ట్విటర్‌లో చంద్రబాబుపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు.
‘వరదలొచ్చిన ప్రతిసారి వేలమంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ,పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ చంద్రబాబుకు వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి. లేకపోతే లావైపోతారు. ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలారు. సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ జగన్ దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు.