సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపు మేరకు వరుసగా మూడోరోజూ ఆదివారం సీమాంధ్రలో బంద్ సంపూర్ణంగా సాగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లకష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్యెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో మోటర్ బైక్ ర్యాలీ, చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో ర్యాలీ, శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ విజయవంతం చేశారు. విశాఖజిల్లా చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మంత్రి బాలరాజు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు హర్షకుమార్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి, చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీ బంద్‌కు వర్తక, వ్యాపారులు మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కొవ్వూరులో పార్లమెంటరీ నియోజకవర్గ నేత బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా విజయవాడలో పార్టీ కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి దిగ్బంధనం చేశారు. వన్‌టౌన్‌లో పట్టణ కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మానవహారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. గుడివాడలో పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) పట్టణంలో బంద్ చే యించారు.
ఎక్కడికక్కడ రాస్తారోకోలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. మంగళగిరిలో పార్టీ కృష్ణా,గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్లరామకృష్ణారెడ్డి, గురజాలలో పార్టీ సమన్వయకర్త జంగాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వినుకొండలో సమన్వయకర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో దాదాపు 500 బైక్‌లతో పార్టీ నేతలు, కార్యకర్తలు.. కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టిల్లోని సమైక్యాంధ్ర శిబిరాలను సందర్శించి దీక్ష చేస్తున్నవారికి సంఘీభావం తెలిపారు. కాగా రైల్‌రోకోలతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
హైవేల దిగ్బంధం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జాతీయ రహదారులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ హైవేలను దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని, చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మచెరువు మిట్ట వద్ద ముంబై-చెనై్న జాతీయ రహదారిని దిగ్బంధించారు. తూర్పుగోదావరి జిల్లా చిత్రాడ రైల్వే పై్లఓవర్‌పై రాస్తారోకో చేసి 216 జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సారధ్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. వీరవాసరంలో జాతీయ రహదారిపై టెంట్‌లు వేసి వాహనాలను నిలిపిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్‌పోస్‌ట వద్ద జాతీయ రహదారిపై పార్టీ కార్యకర్తలు బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. నరసన్నపేటలో పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా, అనంతపురం జిల్లా గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో చేసి కర్ణాటక ఎక్‌సప్రెస్ రైలును అడ్డుకున్నారు. మా