
సాక్షి, తాడేపల్లి: టీటీడీలో భక్తుల దర్శనాలకు ఆటంకం ఉండదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని నిర్ధారణకు వచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. ‘‘తిరుపతిలో లాక్‌డౌన్ నేపథ్యంలో స్థానిక బుకింగ్ నిలిపివేశాం. కంటైన్‌మెంట్ జోన్లలో ఉండేవారు తిరుమల రావద్దు. అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని’’ ఆయన వెల్లడించారు. భక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment