జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు | ZPTC,MPTC Reservations finalized | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు

Published Fri, Mar 7 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

ZPTC,MPTC Reservations finalized

ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను జెడ్పీ సీఈవో ద్వారంపూడి వెంకటరెడ్డి గురువారం ప్రకటించారు. ఈ ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్లను ఎస్సీలకు ఓటర్ల లెక్కల ప్రకారం కేటాయించగా, బీసీలకు ప్రొజెక్టెడ్ పాప్యులేషన్ విధానంలో ఆర్థిక సర్వే ఆధారంగా 
 
35.2 శాతం  కేటాయించినట్టు అధికారులు తెలిపారు. దీంతో 1994 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం 4వ దఫా స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ చట్ట ప్రకారం 1995లో మొదటిసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2001, 2006లో ఎన్నికలు నిర్వహించారు. 2011లో నిర్వహించాల్సినఎన్నికలు వాయిదా వేస్తూ స్థానిక సంస్థలను ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగించారు. కోర్టు ఆదేశాల మేరకు నేడు ఎన్నికల కోసం రిజర్వేషన్ల ప్రక్రియ అధికారులు పూర్తి చేశారు. జూన్ ఎన్నికలు నిర్వహిం చనున్నారు. ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలో 21 లక్షల 48వేల 462 ఓటర్లు ఉండగా వీరిలో 8 లక్షల 75వేల 215 మంది బీసీలు, 4 లక్షల 72 వేల 591 మంది ఎస్సీలు, 59వేల 688 మంది ఎస్టీలు ఉన్నారు. 
 
903కు చేరిన ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో గత ఎన్నికల వరకు 887 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈ ఎన్నికలకు వాటి సంఖ్య 903కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీల పునర్విభజనచేయగా కొత్తగా 16 స్థానాలు పెరిగాయి. ఎంపీటీసీ స్థానాలకు మండలాల వారీగా రిజర్వేషన్ ప్రకటించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఆయా మండలాల వారీగా జిల్లాలో  465 స్థానాలు మహిళలకు కేటాయించారు.
 
త్వరలో ఎంపీపీలు, జెడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్ల ప్రకటన
మండలంలో ఎంపికైన ఎంపీటీసీల సభ్యులు వారిలో ఒకరిని(పరోక్ష పద్ధతిలో) ఎంపీపీగా ఎన్నుకుంటారు. ఇదే పద్ధతిలో జెడ్పీటీసీల సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ త్వరలో ప్రకటిస్తుందని జిల్లా అధికారులు   తెలిపారు.  
 
 ఎంపీటీసీల రిజర్వేషన్‌ఎస్టీ(జనరల్)  9 
ఎస్టీ(మహిళ) 14
ఎస్సీ(జనరల్) 89 
ఎస్సీ (మహిళ) 113
బీసీ (జనరల్) 129
బీసీ(మహిళ) 142 
అన్‌రిజర్వుడు(జనరల్) 211 
అన్‌రిజర్వుడు (మహిళ) 196  
 
 జెడ్పీటీసీల రిజర్వేషన్
కేటగిరి జెడ్పీటీసీ
ఎస్టీ (మహిళ) ఏలూరు 
ఎస్సీ(మహిళ) పెదపాడు, పాలకోడేరు, అత్తిలి, గణపవరం
ఎస్సీ(జనరల్) జీలుగుమిల్లి, నరసాపురం, ఇరగవరం, నిడమర్రు, వీరవాసరం
బీసీ(మహిళ) కొయ్యలగూడెం, ఉండి ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, దెందులూరు, కాళ్ల 
బీసీ(జనరల్) ఉంగుటూరు, భీమడోలు, పోడూరు, పెనుగొండ, మొగల్తూరు, 
ఆచంట, పెంటపాడు
అన్‌రిజర్వుడు(మహిళ) దేవరపల్లి, ద్వారకాతిరుమల, బుట్టాయిగూడెం, గోపాలపురం, చింతలపూడి,
కొవ్వూరు, తాళ్లపూడి, పెరవలి, నల్లజర్ల, నిడదవోలు 
అన్‌రిజర్వుడు తాడేపల్లిగూడెం, లింగపాలెం, టి.నరసాపురం, తణుకు, పెనుమంట్ర,
చాగల్లు, జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం, కె.కోట, యలమంచిలి, పెదవేగి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement