
శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిర మాసం. తిథి శు.షష్ఠి రా.9.10 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణం ప.12.46 వరకు, తదుపరి ధనిష్ఠ. వర్జ్యం సా.5.08 నుంచి 6.51 వరకు. దుర్ముహూర్తం ప.12.09 నుంచి 12.55 వరకు, తదుపరి ప.2.22 నుంచి 3.06 వరకు. అమృత ఘడియలు తె. 3.32 నుంచి 5.16 వరకు (తెల్లవారితే మంగళవారం)
సూర్యోదయం: 6.17 సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
నమాజ్ వేళలు
ఫజర్ : 5.14
జొహర్ : 12.05
అసర్ : 4.04
మగ్రీబ్ : 5.40
ఇషా : 6.57
భవిష్యం
మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనలాభం. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కొన్ని పనులు కొంత నె మ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. శ్రమ తప్పదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు. సోదరులో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.
కర్కాటకం: పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కన్య: సన్నిహితులతో వివాదాలు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: రుణాలు చేయాల్సిన పరిస్థితి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వృశ్చికం: ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు: పనులలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో కొంత చికాకులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రయాణాలు అనుకూలిస్తా యి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.
కుంభం: మిత్రులు, శ్రేయోభిలాషులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో అవాంతరాలు. అనారోగ్యం. భూ వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహ న, భూయోగాలు. ఆధ్యాత్మికచింతన. వ్యా పారాలు, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.
– సింహంభట్ల సుబ్బారావు