10 శాతం పెరిగిన ట్యాబ్‌ల అమ్మకాలు
ఐడీసీ... సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాలు
న్యూఢిల్లీ: ట్యాబ్లెట్‌ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 8,60,000 గా ఉన్న ట్యాబ్‌ల విక్రయాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 10 శాతం వృద్ధితో 9,40,000కు పెరిగాయని పేర్కొంది. ఏడాది కాలంలో ఇదే గరిష్టమైన వృద్ధి అని తెలిపింది. ప్రభుత్వ, వాణిజ్య సంస్థల నుంచి డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు పెరిగాయని వివరించింది. ట్యాబ్లెట్‌ల విక్రయాల్లో శామ్‌సంగ్‌దే అగ్రస్థానం. 22 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(10.9 శాతం), ఐ బాల్(10.6 శాతం), డేటా విండ్(8.2 శాతం), యాపిల్ (6.7 శాతం) ఉన్నాయి.