Tablets sales
-
మోటో ట్యాబ్ జి20, ట్యాబ్లెట్ మార్కెట్లోకి మోటరోలా ఎంట్రీ
మోటరోలా ట్యాబ్లెట్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. మోటో ట్యాబ్ జి20ను విడుదల చేసింది. 8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో, టీడీడీఐ టెక్నాలజీతో మెరుగైన టచ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో కూడిన ట్యాబ్లెట్లో మీడియా టెక్ హీలియో పీ22టీ ఆక్టాకోర్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది. ఈనెల 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై బుక్ చేసుకోవచ్చని.. ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ, యాక్సిస్ కా ర్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. -
డాక్టర్ చీటీ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు..
సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్): డాక్టర్ ప్రిస్క్రిఫ్షన్ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాలు.. మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన భూపతి వెంకటేష్ (32) మల్కాజిగిరిలోని మెడ్‌ప్లస్ స్టోర్ ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా డాక్టర్ల చీటీలు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, ట్యాబెట్లను కాలేజీ విద్యార్థులతో పాటు రైల్వే స్టేషన్లలో తిరిగే మైనర్లకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద నుంచి 785 ఇంజక్షన్లు, 585 ట్యాబ్లెట్స్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి శనివారం వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించామని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు తెలిపారు. -
ఫార్మాకు ‘విటమిన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 ప్రభావం భారత్‌లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని మందుల వినియోగం తగ్గితే, మరికొన్నిటి వాడకం పెరిగింది. ప్రధానంగా గ్యాస్ట్రో, న్యూరో, ఆప్తల్మాలజీ, డెంటల్, గైనిక్ సంబంధ ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయంతో ఆసుపత్రులకు రోగు లు వెళ్లకపోవడం, చికిత్సలు వాయిదా వేసుకోవడమే ఇందుకు కారణం. కార్డియో, డయాబెటిక్ వంటి మందుల అమ్మకాల్లో పెద్దగా మార్పులేదు. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్ తదితర ఔషధాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. విటమిన్ల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. విటమిన్లపైనే ఫోకస్.. దాదాపు అన్ని ఫార్మా కంపెనీల పోర్ట్‌ఫోలియోలో విటమిన్లు కూడా ఉంటున్నాయి. మొత్తం ఫార్మా విక్రయాల్లో కోవిడ్ ముందు వరకు విటమిన్ల వాటా కేవలం 5–10 శాతమే. ఇప్పుడిది 30–40 శాతానికి చేరిందని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మల్టీ విటమిన్లు, బి, సి, డి, జింక్ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో లేనంతగా పెరిగాయి. కంపెనీలు మొదట శానిటైజర్లు, ఆ తర్వాత విటమిన్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. అయితే వీటికి డిమాండ్ అధికమవడంతో ధర 20 శాతం దాకా పెరిగింది. ఇతర ఔషధాల అమ్మకాలు తగ్గినా.. కంపెనీలను విటమిన్లు ఆదుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఫార్మా రంగంలో ఉద్యోగుల తీసివేతలు జరగలేదని, కొత్త నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు. రెండేళ్లలో రూ.1,000 కోట్లు.. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, జనరిక్స్, ఇంజెక్టేబుల్స్ తయారీలో భారత్‌లో తొలి స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో సుమారు 1,500 దాకా కంపెనీలు ఉన్నాయి. 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఎగుమతి మార్కెట్లతోపాటు దేశీయంగా ఔషధాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒకట్రెండేళ్లలో 25 దాకా కంపెనీల నుంచి కొత్త యూనిట్లు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మిగిలిన కంపెనీలు అన్నీ ఇప్పటికే ఉన్న ప్లాంట్లలో విస్తరణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ కంపెనీలు రెండేళ్లలో రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి చేసే అవకాశం ఉంది. తద్వారా కొత్తగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బద్దిలో ప్లాంట్లను నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు తదుపరి విస్తరణ హైదరాబాద్‌లో చేపట్టనున్నాయని ఫ్యూజన్ హెల్త్‌కేర్ ఎండీ మధు రామడుగు తెలిపారు. భాగ్యనగరి సమీపంలో ప్రతిపాదిత ఫార్మా సిటీ సాకారం అయితే పెద్ద ఎత్తున కొత్త ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. ఏపీలోనూ కంపెనీల విస్తరణ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్లలో విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. అయితే పరిమితులు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు. ‘ఫార్మా సిటీ సాకారమయ్యే వరకు వీటి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. చాలా ప్లాంట్లు యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్నవే. కొత్తగా ఎఫ్‌డీఏ నుంచి అనుమతి తీసుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బల్క్ డ్రగ్ పార్క్‌లలో ఒకటి తెలంగాణలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండేళ్లలో 50–60 యూనిట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఈ ఏడాది 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది’ అని వివరించారు. ఎగుమతులతో కలుపుకుని భారత ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు ఉంది. -
కోవిడ్ ‘ట్యాబ్లెట్’
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థకు కోవిడ్ కొత్త బాటలు వేసింది. ఇంతకాలం విదేశాలకే పరిమితమైన ఆన్లైన్ బోధన ఇప్పుడు మనల్నీ పలకరిస్తోంది. గతంలో కొన్ని పెద్ద విద్యాసంస్థలే ఆన్లైన్ చదువుకు ప్రాధాన్యమిచ్చేవి. ఇప్పుడు గల్లీ బడులు కూడా అదే బాట పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల చేతుల్లో ట్యాబ్లెట్ మొబైల్స్ సాధారణమయ్యే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ తర్వాత క్రమంగా తెరుచుకుంటున్న మొబైల్ షాపుల్లో టాబ్లెట్ మొబైల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. గత మంగళవారం నుంచి నగరవ్యాప్తంగా మొబైల్ షాపులు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న షాపులు దాదాపు తెరుచుకోగా, పెద్ద షోరూమ్‌లు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. తెరుచుకున్న వాటిల్లో సాధారణ సెల్ఫోన్లు కొనేవారు ఎక్కువగా వస్తుండగా, గతంలో ఎన్నడూ లేన ట్టు ట్యాబ్లెట్ మొబైల్స్ కొనుగోలు రెట్టిం పైంది. గతంలో నెలలో 10 – 15 టాబ్లెట్స్ అమ్మే షోరూమ్‌ల్లో ఇప్పుడు రోజూ 2 – 3 చొప్పున కొంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా విద్యార్థులే కావటం విశేషం. మూడేళ్ల క్రితం సాధారణ ట్యాబ్స్ ధర రూ.10వేలుగా ఉండేది. ప్రస్తుతం రూ.3వేలకు మామూలు ట్యాబ్స్ లభిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల హైఎండ్ మోడల్ దాదాపు రూ.30వేలకుపైగా ఉంటోంది. కానీ ప్రస్తుతం సాధారణ ట్యాబ్స్‌ను కొనేందుకే విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వారు తక్కువ ధర వాటినే ఎంచుకుంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా షాపుల్లో 20 వరకు ట్యాబ్స్ సిద్ధంగా ఉంచుతున్నామని ఓ షోరూమ్ నిర్వాహకుడు చెప్పారు. అయితే, పెద్ద కంపెనీల నుంచి సకాలంలో ఫోన్లు, ట్యాబ్స్ సరఫరా కావట్లేదని, పూర్తిగా క్రమబద్ధం కావటానికి మరో నెల పడుతుందని ఆయన తెలిపారు. కాగా, లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న షోరూమ్‌లకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో చాలా ఫోన్లు పాడవటంతో షాపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని వినియోగదారులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దుకాణాలు తెరుచుకోగానే క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్ షాపులు రద్దీగా మారాయి. ‘ట్యాబ్లెట్స్’ ట్రెండ్ నడుస్తోంది లాక్డౌన్ తరువాత షోరూమ్‌లు తెరిస్తే కొనుగోలుదారులు వస్తారా అనే అనుమానం ఉండేది. కానీ లాక్‌డౌన్‌కు ముందున్నట్టే ఇప్పుడూ స్పందన ఉంది. అయితే, గతంతో పోలిస్తే 20శాతం మేర కొనుగోలుదారుల రాక తక్కువగా ఉం దనిపిస్తోంది. త్వరలోనే అదీ భర్తీ అవుతుంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. గతంలో మాదిరిగా వినియోగదారులు ఎక్కువసేపుండకుండా తొందరగా వెళ్లిపోతున్నారు. హైఎండ్ మోడల్స్ తక్కువగా, బడ్జెటరీ మోడల్స్ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ట్యాబ్లెట్స్ కొనుగోళ్లు ట్రెండ్‌గా మారాయి. – బాలు చౌదరి, ఫౌండర్ అండ్ సీఎండీ, బిగ్ సీ -
10 శాతం పెరిగిన ట్యాబ్‌ల అమ్మకాలు
ఐడీసీ... సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాలు న్యూఢిల్లీ: ట్యాబ్లెట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 8,60,000 గా ఉన్న ట్యాబ్‌ల విక్రయాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 10 శాతం వృద్ధితో 9,40,000కు పెరిగాయని పేర్కొంది. ఏడాది కాలంలో ఇదే గరిష్టమైన వృద్ధి అని తెలిపింది. ప్రభుత్వ, వాణిజ్య సంస్థల నుంచి డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు పెరిగాయని వివరించింది. ట్యాబ్లెట్ల విక్రయాల్లో శామ్‌సంగ్‌దే అగ్రస్థానం. 22 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(10.9 శాతం), ఐ బాల్(10.6 శాతం), డేటా విండ్(8.2 శాతం), యాపిల్ (6.7 శాతం) ఉన్నాయి.