‘స్మార్ట్’గా నెట్ విహారం!
• స్మార్ట్‌ఫోన్ వెంట జనరేషన్-జీ
• వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే మక్కువ
• టీసీఎస్ యూత్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చేతిలో పుస్తకమే కాదు.. గ్యాడ్జెట్ సైతం ఉండాలంటోంది నవతరం. 1995 తర్వాత జన్మించిన వారికి (జనరేషన్-జీ) స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీ అత్యంత ప్రాధాన్య ఉపకరణాలుగా మారాయని అధ్యయనంలో తేలింది. 12-18 ఏళ్ల వయసున్న విద్యార్థుల డిజిటల్ అభిరుచులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చేపట్టిన యూత్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చారుు. హైదరాబాద్ జనరేషన్-జీ గ్రూప్‌లో 69 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ ప్రధాన్య గ్యాడ్జెట్‌గా నిలిచింది. ఇంట్లో ఫిక్స్‌డ్ లైన్/వైఫై ద్వారా 85 శాతం మంది నెట్లో విహారం చేస్తున్నారట. 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్లో 4జీ/3జీని వినియోగిస్తున్నారు. 88 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. యాప్స్‌లో గేమింగ్ తర్వాత వాట్సాప్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ యాప్స్ వరుసలో ఉన్నారుు.
చాటింగ్ కోసమే..
హైదరాబాద్ జనరేషన్-జీ గ్రూప్‌లో 78% మంది స్కూల్ అసైన్‌మెంట్ కోసం ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. 61% ఇన్‌స్టంట్ మెసేజింగ్ కోసం ఇంటర్నెట్‌లో విహరిస్తున్నారు. 60% గేమ్స్, మ్యూజిక్‌కు, 56 % సోషల్ మీడియా, వీడియోలు, సినిమాల కోసం నెట్‌ను వినియోగిస్తున్నారు. 48% అబ్బారుులు, 31% అమ్మారుులు షాపింగ్‌కు నెట్‌పై ఆధారపడుతున్నారు. నెలవారీ మొబైల్ బిల్లు రూ.500 లోపు చేస్తున్నట్టు 51% మంది తెలిపారు. బిల్లు రూ.501-1,000 మధ్య అవుతున్నట్టు 18% అబ్బారుులు, 13% మంది అమ్మరుులు వెల్లడించారు. 31 శాతం అమ్మారుులకు, 22% మంది అబ్బారుులకు అసలు ఫోనే లేదంట. ఇక విద్యార్థుల రోల్ మోడల్స్‌గా స్టీవ్ జాబ్స్ ముందు వరుసలో ఉన్నారు. అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వరుసలో నిలిచారు.
యాక్టివ్‌గా ఫేస్‌బుక్‌లో..
ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్నవారి సంఖ్య 62% ఉంది. ఈ విషయంలో 67%తో అబ్బారుులు ముందంజలో ఉన్నారు. 40% అమ్మారుుల సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్కేనట. గూగుల్ ప్లస్, ఇన్‌ట్రాగామ్, ట్విటర్, స్నాప్‌చాట్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారుు. ఫేస్‌బుక్‌లో అబ్బారుులకే స్నేహితులెక్కువ. సినీ తారలను ఫాలో కావడంలో అమ్మారుులే టాప్. అబ్బారుులు ఎక్కువగా క్రీడాకారులను ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ సెలబ్రిటీలు, చానెళ్లనూ నవతరం ఫాలో అవడం విశేషం. వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తున్నది అమ్మారుులే. 83% జనరేషన్-జీ గ్రూప్ సభ్యులకు వాట్సాప్ ముఖ్యమైన మెసేజింగ్ యాప్. తల్లిదండ్రుల ఒత్తిడి, సమయం వృధా కారణంతో 68% మంది సోషల్‌మీడియా అకౌంట్‌ను ఒక్కసారైనా డిలీట్/డీయాక్టివేట్ చేశారట.