హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వార్షిక వృద్ధి 23%
మే నెల దేశవ్యాప్త వృద్ధి 26 శాతం: మాన్‌స్టర్.కామ్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో ఆన్‌లైన్ నియామకాల వృద్ధి 23 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి మే నెలలో 26 శాతంగా ఉంది. ఈ విషయం మాన్‌స్టర్ సర్వేలో వెల్లడైంది. నెలవారీగా చూస్తే దేశవ్యాప్తంగా మార్చి, ఏప్రిల్‌లలో ఉద్యోగ నియామకాలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. సర్వే ప్రకారం...
తయారీ, ఉత్పత్తి రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరిగాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే దాదాపు 13 వృత్తి విభాగాల్లో నియామకాల వృద్ధి కనిపించింది. ఆర్ట్స్ రంగ నిపుణుల డిమాండ్ కొనసాగుతోంది. వీరికి అవకాశాలు 56% పెరిగాయి. టైర్ 2 పట్టణాలు ఉద్యోగాల సృష్టిలో ముందున్నాయి.