యాప్ కీ కహానీ...
6 ప్యాక్ వర్క్‌ఔట్
వ్యాయామం చేయడం వల్ల మంచి శరీరాకృతితోపాటు, ఆరోగ్యంగా ఉండొచ్చు. దీని కోసం రోజూ జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే చేసుకోవడానికి వీలుగా మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ‘6 ప్యాక్ వర్క్‌ఔట్’ అనే హెల్త్, ఫిట్‌నెస్ యాప్. ఎలాంటి ఉపకరణాలు అవసరం లేకుండా ఇంట్లోనే రోజూ వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. దీన్ని మనం మన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
♦ యాప్‌లో బిగినర్ 6 ప్యాక్ 8 మినిట్ వర్క్‌ఔట్స్, ఇంటర్మీడియట్ వర్క్‌ఔట్స్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే మూడు రకాల విభాగాలు ఉంటాయి.
♦ ఒకదాని తర్వాత మరొకదానికి అప్‌గ్రేడ్ అవుతూ రావాలి. ఇక్కడ తొలి రెండు విభాగాల్లోని వ్యాయామాలను ఉచితంగా పొందొచ్చు. కానీ మూడవది ప్రొ వెర్షన్. కొనుగోలు చేయాలి.
♦ వర్చువల్ ట్రైనర్‌ను చూస్తు మనం వ్యాయామం చే యొచ్చు.
♦ -యాప్ ద్వారా బరువు తగ్గడానికి టిప్స్‌ను పొందొచ్చు.