
తొలిసారి ఇల్లు కొంటే...అదనపు పన్ను ప్రయోజనం
తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారు శుక్రవారం నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు.
న్యూఢిల్లీ: తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారు శుక్రవారం నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు. అయితే కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, దానిపై తీసుకున్న రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి. తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఇంటి కొనుగోలు చేసేవారు రుణ వడ్డీపై రూ.50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రతిపాదన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. దీంతో తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవారు మొత్తంగా ఇంటి రుణ వడ్డీపై ఏడాదికి రూ.2.5 లక్షలు మినహాయింపు పొందొచ్చు.