వాట్సాప్‌ తర్వాత ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ బ్రేక్‌.. | After WhatsApp, now Facebook's Messenger hit by temporary outage | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ తర్వాత ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ బ్రేక్‌..

Published Sat, Nov 4 2017 12:19 PM | Last Updated on Sat, Nov 4 2017 5:41 PM

After WhatsApp, now Facebook's Messenger hit by temporary outage - Sakshi

వాట్సాప్‌ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడి 24 గంటల అనంతరం ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ సర్వీసులు కూడా ఇదే బారిన పడ్డాయి. శనివారం రోజు మెసెంజర్‌ సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్టు తెలిసింది. ట్విట్టర్‌లో పలు యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెసెంజర్‌ అకౌంట్ల ద్వారా ఎలాంటి మెసేజ్‌లను పంపించడం, స్వీకరించడం కుదరడం లేదని యూజర్లు పేర్కొన్నారు. పాత మెసెజ్‌లను కూడా చూడలేకపోతున్నామని కొంతమంది యూజర్లు రిపోర్టు చేశారు. ''ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. నా మెసేజ్‌లన్నీ కనిపించడం లేదు. ఎవర్ని కాంటాక్ట్‌ చేయడం కూడా కుదరడం లేదు... ప్లీజ్‌ సాయం చేయండి'' అంటూ ఓ యూజర్లు ట్వీట్‌ చేసింది. 

నిన్న కూడా ఇదే మాదిరి వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లో పాటు పలు ప్రపంచ దేశాల్లో వాట్సాప్‌ సేవలు పనిచేయలేదు. కారణమేమిటన్నది తెలియనప్పటికీ, తర్వాత కొద్ది సేపటికి ఈ సేవలు రిస్టోర్‌ అయ్యాయి. తమ సేవలకు అంతరాయం ఏర్పడటంపై వాట్సాప్‌ యూజర్లకు క్షమాపణ చెప్పింది. వాట్సాప్‌ డౌన్‌ అవ్వడమే ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌ ఐటెమ్‌గా నిలిచింది. పాకిస్తాన్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పలు దేశాల్లో ఇదే టాప్‌ ట్రెండింగ్‌ విషయం. ప్రస్తుతం ఈ విషయంపై వాట్సాప్‌ విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఇలా జరగడం ఇది మూడోసారి. ఆగస్ట్‌లోనూ ఇలాగే కొంత సేపు వాట్సాప్ పనిచేయలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement