సాక్షి, న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో పర్సనల్ మెసెంజేర్ యాప్ వాట్సాప్‌కు గట్టి సవాల్ ఎదురవుతోంది. ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌తో ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు ‘సిగ్నల్’ను అందిపుచ్చుకుంటున్నారు. వాట్సాప్ తన సోదర సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను పంచుకుంటుందన్న తాజా ప్రైవసీ అప్‌డేట్ కారణంగా అచ్చం వాట్సాప్‌ను పోలి ఉండే ‘సిగ్నల్’ యాప్‌ను ఎంచుకుంటున్నారు. ‘సే హెలో టు ప్రైవసీ’ అన్న టాగ్‌లైన్‌తో ఉండే సిగ్నల్ యూజర్ల డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌ను వెల్లడించడంతో దీనిపై చర్చ మొదలైంది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల ‘సిగ్నల్’ యాప్‌ను వాడమని తన ట్విటర్ ఫాలోవర్స్‌కు పిలుపునివ్వడంతో క్రమంగా వాట్సాప్ యూజర్లు సిగ్నల్ యాప్‌లోకి జంప్ అవుతున్నారు. ఒక్కసారిగా ప్రైవసీపై చర్చ జరగడం, యూజర్ల డేటాను ఫేస్‌బుక్ వినియోగించుకోవడం వంటి అంశాల కారణంగా.. ప్రైవసీపై అధికంగా ఫోకస్ చేసే సిగ్నల్ యాప్ తెరపైకి వచ్చింది. సిగ్నల్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీకి సొంతమైన ఈ సిగ్నల్ యాప్‌ను మాక్సీ సృష్టించారు. వాట్సాప్ కోఫౌండర్ బ్రియన్ ఆక్టన్ ఈ సిగ్నల్ ఫౌండేషన్‌కు కూడా కోఫౌండర్.
ఇవీ ప్రత్యేకతలు..
మామూలు మొబైల్ కాల్ తరహాలో సిగ్నల్ యాప్‌లో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. మీ ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళతాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్ యాప్‌లో వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. గ్రూప్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్‌లై ఇవ్వడం, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
చాట్ ప్రైవసీనే..
అయితే వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని, పర్సనల్ చాట్స్ విషయంలో ఇంతకుముందున్న పాలసీనే ఇప్పుడూ కొనసాగుతుందని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. అయితే అకౌంట్ రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే ఫోన్ నెంబర్, లొకేషన్, మొబైల్ డివైజ్ డేటా, ఐపీ అడ్రస్ వంటివి ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీస్‌కు షేర్ చేయనున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్‌బుక్, లేదా థర్డ్ పార్టీస్‌ను వినియోగించే సంస్థలు విని యోగదారులతో కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా వాట్సాప్‌ను వినియోగించేలా తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా మరో యాప్
Published Sun, Jan 10 2021 8:54 AM | Last Updated on Sun, Jan 10 2021 8:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment