రూ. 100 టికెట్ తో ఎయిర్ ఇండియా వెబ్ సైట్ క్రాష్
న్యూఢిల్లీ: వినియోగదారుల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో బుధవారం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సేవలు స్తంభించిపోయాయి. 100 రూపాయలకే ఎయిర్ ఇండియా టికెట్ అనే కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కేవలం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారానే వినియోగదారులు టికెట్ బుక్ చేసుకోవాలంటూ నిబంధన విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించారు. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయిందని ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సందర్శించిన వారికి 'సేవలు అందుబాటులో లేవు' అనే సందేశం కనిపిస్తోంది. 100 రూపాయల టికెట్ ఆగస్టు 27 తేది నుంచి ఐదు రోజులపాటు ఈ అవకాశాన్ని కల్పించారు.