![ఎయిర్ కోస్టా ‘రీ ఫ్రెష్’ ఆఫర్](/styles/webp/s3/article_images/2017/09/3/81454355608_625x300.jpg.webp?itok=08iO4nNf)
ఎయిర్ కోస్టా ‘రీ ఫ్రెష్’ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమాన సర్వీసుల సంస్థ ఎయిర్‌కోస్టా ‘రీఫ్రెష్ మంత్’ పేరుతో ప్రయాణికులకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి నెలల్లో ఎయిర్‌కోస్టాలో ప్రయాణించే ప్రయాణికులకు కాంప్లిమెంటరీ స్నాక్స్‌ను అందిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయవాడ-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-హైదరాబాద్ సర్వీసుల్లో ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.