రేపు బ్యాంకుల బంద్!
ఏఐబీఈఏ పిలుపు
ముంబై: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనవరి 8న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్‌బీఐ తన అసంబద్ధ, అనుచిత వృత్తి సంబంధిత నిబంధనలను అనుబంధ బ్యాంకుల్లో కూడా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అందుకే వాటికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏఐబీఈఏ తెలిపింది.
ఎస్‌బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల బ్యాంకులు ఐదూ అనుబంధంగా ఉన్నాయి. వీటిని ఎస్‌బీఐ పరిధి నుంచి తప్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది.