ఫైనాన్షియల్ బేసిక్స్..
ఎన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలుండాలి?
సాధారణంగా మన అవసరాలకు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సరిపోతుంది. కానీ ప్రస్తుతం సమాజంలో ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలుంటున్నాయి. ఖాతా తెరవటం అనేది వారి అవసరాలపై ఆధారపడి ఉంటుంది. చాలా సంస్థలు/కంపెనీలు వారి ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు గానూ వేతన బ్యాంక్ ఖాతాలను కూడా అందిస్తున్నాయి. బ్యాంక్ ఖాతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందగలమో.. అదే స్థాయిలో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకే బ్యాంక్ ఖాతాను కలిగి ఉండడం వల్ల మన లావాదేవీలన్ని ఒకే బ్యాంక్‌లో నిక్షిప్తమౌతూ వస్తాయి. దీని వల్ల మన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సులభంగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బలంగా తయారవుతుంది.