financial status
-
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు: దువ్వూరి కృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం. రుణాలు.. నాడు–నేడు: రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్ డెట్)తో.. పబ్లిక్ ఎక్కౌంట్ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో: విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో: ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు: ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. గ్యారెంటీ లేని రుణాలు: ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్ రంగంలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. డిస్కమ్‌లు–బకాయిలు: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే: మొత్తం మీద పబ్లిక్ డెట్ టు పబ్లిక్ ఎక్కౌంట్ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్ మాత్రమే పెరిగింది. రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం: నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?. అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం. టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది: 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే.. (డెట్ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు: మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్ వ్యయం కాగా, పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. పథకాలు–ప్రయోజనాలు: విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది. 👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 👉 కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం కోల్పోయాం: కోవిడ్ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అప్పటి కంటే తక్కువ ఫైన్లు: వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు. మూలధన వ్యయమూ ఎక్కువే: కాగ్ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండీచర్) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు.. -
రికవరీకి అవకాశాలు
ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ► ఆర్థిక గణాంకాలు చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ► ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది. -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్‌మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్‌లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్‌ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
మూడోరోజూ రికార్డులే...
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ రికార్డుల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి తొలిసారి 44 వేల పైన 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 12,938 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రూపాయి 27 పైసలు బలపడటం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతం వార్తలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలోసెన్సెక్స్ 262 పాయింట్లు లాభపడి 44,215 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 12,948 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, టెలికాం రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆర్థిక కంపెనీల యాజమాన్యాలు వెల్లడించిన అవుట్‌లుక్‌లో... ఆదాయాలతో పాటు, ఆస్తుల నాణ్యత మెరుగుపడతాయనే వ్యాఖ్యలతో ఈ రంగ షేర్ల ర్యాలీచేస్తున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. ఇటీవల పతనాన్ని చవిచూసిన ఆటో షేర్లల్లో షార్ట్ కవరింగ్ జరిగినట్లు వారంటున్నారు. లక్ష్మీ విలాస్.. లోయర్ సర్క్యూట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్బీఐ పర్యవేక్షణలోకి వెళ్లిన లక్ష్మీ విలాస్ బ్యాంకు షేరు బుధవారం 20 శాతం నష్టపోయి రూ.12.40 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఆర్థిక వ్యవహారాల పటిష్టతల దృష్ట్యా ఆర్బీఐ నెలరోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 6 శాతం లాభపడ్డ ఎల్అండ్టీ షేరు.... టాటా స్టీల్ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ షేరు 6% లాభపడి రూ.1,148 వద్ద ముగిసింది. నాల్కో నుంచి మధ్యంతర డివిడెండ్... ప్రభుత్వ రంగ అల్యూమినియం తయారీ కంపెనీ నాల్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్ రికార్డు ర్యాలీ నేపథ్యంలో అదానీ గ్యాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జుబిలెంట్ పుడ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, వైభవ్ గ్లోబల్స్ షేర్లు జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. విప్రో బైబ్యాక్.. డిసెంబర్ 11 న్యూఢిల్లీ: ప్రతిపాదిత షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కి డిసెంబర్ 11 రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో వెల్లడించింది. దీని కింద సుమారు రూ. 9,500 కోట్ల దాకా విలువ చేసే షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 400 రేటు నిర్ణయించింది. విప్రో గతేడాది సుమారు రూ. 10,500 కోట్ల దాకా విలువ చేసే షేర్ల బైబ్యాక్ నిర్వహించింది. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారు. -
ఇన్ఫ్రా పెట్టుబడులు జోరందుకోవాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. ‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఆర్బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు. వ్యవ’సాయం’.. ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. వృద్ధి చోదకంగా ఐసీటీ.. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు. మారటోరియం పొడిగించొద్దు: హెచ్డీఎఫ్సీ పరేఖ్ రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు. -
భారత్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందుతున్నానని చెప్పలేను. అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నప్పటికీ మునిగిపోకుండా నీటికి ఉపరితలంపైనే భారత తన తలను ఉంచగలుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎకనమిక్స్ టైమ్స్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎంత నర్మగర్భంగా ఆమె మాట్లాడిన దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి రేటు 0.2 శాతం ఒక్క జూన్ నెలలోనే పడిపోయింది. అది 50 నెలల కనిష్టస్థాయి కావడం ఆందోళనకరం. 11 ఆటోమొబైల్ కంపెనీల్లో 9 కంపెనీల లాభాలు జూలై నెలలో రెండంకెల శాతం పడిపోవడం మరింత ఆందోళనకరం. ఆటోమొబైల్ అమ్మకాలు గత 9 నెలలుగా వరుసగా పడిపోతున్నాయి. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతి కంపెనీ అమ్మకాలు 30 శాతానికి మించి పడిపోవడం అనూహ్య పరిణామం. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి నియంత్రణా చర్యలు చేపట్టాయి. ఈ కారణంగా పలు యూనిట్లలో ‘లేఆఫ్’లు ప్రకటించే ప్రమాదం ఉంది. సరకుల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండే హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, గోద్రెజ్ లాంటి కంపెనీలు 2019, తొలి త్రైమాసికంలో కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే సాధించాయి. ఈ తిరోగమన పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని ‘16 కీలక ఆర్థిక సూచికలు’ సూచిస్తున్నాయి. ‘ఓ పక్క డిమాండ్ లేదు, మరోపక్క ప్రైవేటు పెట్టుబడులు లేవు. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఊడి పడుద్దా?’ అని బజాజ్ ఆటోస్ చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. పొదుపు ఖాతాల సొమ్ము గత ఐదేళ్ల కాలంలో భారీగా పడిపోవడం కూడా ఆర్థిక ప్రమాద ఘంటికే. ఈ సొమ్ము 2013–14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 22 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 17 శాతానికి పడిపోయింది. దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా పెరుగుతుండడం వల్ల ఉద్యోగాలు చేసే యువత సంఖ్య తగ్గుతూ వారిపై ఆధారపడి బతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని, సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే పొదుపు ఖాతా సొమ్ము పెరుగుతుంది. అలా జరగడం లేదంటే పరిస్థితి ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉన్నట్లు లెక్క. మరోపక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలు భారీగా పడిపోతుండడం కూడా ఆందోళనకరమే. ఈ ఏడాది పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనా వేయగా, మొదటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి. ఆర్థిక పరిస్థితి మందగించిందని ‘నీతి ఆయోగ్’ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేయడం కూడా ఇక్కడ గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామన్న ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ నెరవేరడం ఏమోగానీ ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్న ఆశ నెరవేరడం కూడా కనా కష్టమే. -
మా పిల్లలు మాకంటే ధనవంతులవుతారు
తమ పిల్లలు తమ కంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలుస్తారని 66శాతం మంది భారతీయులు గట్టిగా నమ్ముతున్నారు.1990 నుంచి భారత దేశపు తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి 266 శాతం పెరగడం, 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు సగటు భారతీయుడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో పిల్లలు భవిష్యత్తులో తమ కంటే ఆర్థికంగా మెరుగైన స్థితి సాధిస్తారని మూడింట రెండు వంతుల మంది పెద్దలు విశ్వసిస్తున్నారు. ప్రముఖ అమెరికా మేథో సంస్థ ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయింది.‘ స్ప్రింగ్ 2018 గ్లోబల్ ఆటిట్యూడ్ సర్వే’ పేరుతో ప్యూ సంస్థ భారత్ సహా 27 దేశాల్లో వివిధ అంశాలపై ప్రజల అభ్రిపాయం సేకరించింది. మన దేశంలో ఈ ఏడాది మే 23 జులై 23 మధ్య 2,521 మంది పెద్దలను ఇంటర్వ్యూ చేసింది. ఆర్థిక స్థితి బాగుంది దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగుందని 56 శాతం మంది అభ్రిపాయపడ్డారు.2017లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన వారు 83శాతం మంది. అంటే ఆర్థిక స్థితిపై సంతృప్తి వ్యక్తం చేసిన వారి శాతం ఏడాదిలో గణనీయంగా తగ్గిపోయింది. ప్యూ సంస్థ సర్వే చేసిన 27 దేశాల్లో ఎక్కడా ఇంత ఎక్కువ (27శాతం)తగ్గుదల కనిపించలేదు. మోదీ సర్కారు ఎన్నికలకు వెళుతున్న సంవత్సరంలో ఆర్థిక స్థితిపై ప్రజలకు నమ్మకం తగ్గడం గమనార్హం.తమ సర్వేలో భారత్ సహా 20 దేశాల్లో పాలక పార్టీకి మద్దతుదారులైన వారే ఆర్థిక స్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని,దీనిని బట్టి ఆర్థిక వ్యవహారాలను కూడా రాజకీయ కోణంలో ఎలా చూస్తున్నారన్నది తెలుస్తోందని గ్లోబల్ ఎకనమిక్ ఆటిట్యూడ్స్ డైరెక్టర్ బ్రూస్ స్టాక్స్ నివేదికలో పేర్కొన్నారు. భారత దేశంలో అధికార పార్టీకి మద్దతిస్తున్న వారిలో 72 శాతం ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పారు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో... రూపాయి మారకం విలువ ఈ ఏడాది 11శాతానికిపైగా తగ్గిపోవడం, పెట్రోలు,డీజిలు ధరలు మూడంకెలకు చేరనుండటం. ముడి చమురు ధరలు పెరగుతుండటం, ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఫలితంగా కరెంట్ ఖాతాలోటు బాగా పెరిగిపోవడం ,వ్యవసాయం సహా పలు కీలక రంగాలు ఇబ్బందులు పడుతుండటం వంటి పలు ఆర్థిక సమస్యలతో భారత్ సతమతమవుతున్న నేపథ్యంలో ఈ నివేదిక విడుదలయింది.ఇన్ని ఇబ్బందుల్లోనూ భారతీయులు భవిష్యత్తు పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సగటు భారతీయుడి ఆర్థిక స్థితి మెరుగుపడిందని, తమ కాలంలో కంటే ఇప్పుడు అన్ని విధాల మెరుగైన పరిస్థితులున్నాయని 65 శాతం మంది భారతీయులు స్పష్టం చేశారు. -
ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తం
శాఖలవారీగా జమా ఖర్చుల నివేదిక స్పెషల్ సీఎస్‌లకు బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అప్పగించింది. ఒక్కో స్పెషల్ సీఎస్‌కు మూడు నాలుగు శాఖల బాధ్యతలను కట్టబెట్టింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆదా య స్థితిగతులపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై కేబినెట్లో చర్చ జరిగింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నా బకాయిలెందుకు పేరుకుపోయాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శాఖల వారీగా వాస్తవ ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా ఆర్థిక పరమైన అంశాలపై సమాచారాన్ని రూపొందించి నివేదిక తయారు చేయాలని స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, శాఖల ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులపై సమీక్షించారు. ప్రతి స్పెషల్ సీఎస్ మూడు నాలుగు శాఖలను అధ్యయనం చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. వివిధ పథకాలపై ఆయా శాఖల ఖర్చు, ఆదాయం తదితర వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చాలని చెప్పారు. వివిధ శాఖలకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయం, కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు, రెవెన్యూ లీకేజీలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, పెండింగ్ బిల్లులు, అవసరమైన నిధులన్నీ ఈ నివేదికలో చేర్చాలని సూచించారు. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఎన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలుండాలి? సాధారణంగా మన అవసరాలకు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సరిపోతుంది. కానీ ప్రస్తుతం సమాజంలో ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలుంటున్నాయి. ఖాతా తెరవటం అనేది వారి అవసరాలపై ఆధారపడి ఉంటుంది. చాలా సంస్థలు/కంపెనీలు వారి ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు గానూ వేతన బ్యాంక్ ఖాతాలను కూడా అందిస్తున్నాయి. బ్యాంక్ ఖాతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందగలమో.. అదే స్థాయిలో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకే బ్యాంక్ ఖాతాను కలిగి ఉండడం వల్ల మన లావాదేవీలన్ని ఒకే బ్యాంక్‌లో నిక్షిప్తమౌతూ వస్తాయి. దీని వల్ల మన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సులభంగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బలంగా తయారవుతుంది. -
ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా లేదు
* ప్రత్యేక హోదా లేనట్లే 7 జిల్లాలకు 60 కోట్లు చొప్పున కేంద్ర సాయం * రాష్ట్రానికి ఆర్థిక సాయంపై వారంలోగా కేంద్రం ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్లేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే మేలు జరుగుతుందని వ్యాఖ్యానించిందన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా ప్రత్యేక అవార్డును ఇప్పించే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అనేక రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని, అంతేకాకుండా ప్రత్యేక హోదా నిబంధనలకు రాష్ట్రం అనువుగా లేదని కూడా పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో గ్రాంట్ రూపంలో కొంత, రుణం రూపంలో కొంత ఆర్థిక సాయం అందించాలని భావిస్తోందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్లలో రూ. 24,350 కోట్ల సహాయాన్ని అందించాలని రాష్ట్రం కోరిందని, అయితే జిల్లాకు రూ. 60 కోట్ల రూపాయల చొప్పున ఏడు జిల్లాలకు ఐదేళ్ల పాటు గ్రాంటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ లోటు భర్తీపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. పైగా ఈ లోటు భర్తీ రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేవలం ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారనే ధోరణిలో ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వారంలోగా రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం ప్రకటన చేస్తుందని, ఆ సాయం రూపాయా ?రెండు రూపాయలా ? అనేది తెలియదని వ్యాఖ్యానించారు. -
అన్ని జబ్బులకూ ఒకటే మందు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. అనేకచోట్ల మాత్రలు, సిరప్లు, సిరంజ్ల స్టాక్ నామమాత్రంగా కూడా లేదు. పలు ఆస్పత్రుల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాము, కుక్కకాటు నివారణ మందులు పాడయ్యాయి. కొన్ని చోట్ల అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోగులే బయట డబ్బులు పెట్టి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో చీకట్లోనే వైద్యం చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 94 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 15 ఏపీవీపీ ఆస్పత్రులు పని చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువచోట్ల పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. అయితే విద్యుత్ సదుపాయం లేకపోవడం, ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో మందులన్నీ పాడైపోయాయి. కొన్ని పీహెచ్‌సీల్లో అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. కొన్నిచోట్ల దగ్గు, అల్సర్‌కు సంబంధించిన సిరప్లు అందుబాటులో లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో చాలా పీహెచ్‌సీల్లో సిరంజ్ తదితరాలు లే కపోవడంతో బయట తెచ్చుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ క్రమంలో పేదలు ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్‌సీల దుస్థితిపై ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత చాలాచోట్ల మార్పు వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలో వైద్యాధికారులు స్పందించి కొరత ఉన్న మందులను తిరుపతి నుంచి తెప్పించారు. అనేక చోట్ల వైద్యులు విధులకు సకాలంలో హాజరవుతున్నారు. సత్యవేడులాంటి పెద్ద ఆస్పత్రుల్లో స్త్రీ వైద్య నిపుణుల కొరత నెలకొంది. ఆపరేషన్ సంబంధిత పరికరాలు, అనస్తీషియా ఇంజక్షన్ల కొరత ఉంది. మదనపల్లె అర్బన్ పీహెచ్‌సీల్లో ఇంజక్షన్లు లేవు. అన్నింటికీ పారాసిట్మాల్ మాత్రలే దిక్కవుతున్నాయి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు. సీటీఎం, బొమ్మనపల్లె పీహెచ్‌సీల్లో సీజన్ల్ వ్యాధులకు మందులు తక్కువగా ఉన్నాయి. వైద్యులు పది మాత్రలు రాస్తే రెండు మాత్రమే ఇస్తున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో పీహెచ్‌సీల్లో పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కార్వేటినగరం, ఎస్.ఆర్.పురంలో ఫ్రిజ్‌లు సరిగా పనిచేయడం లేదు. దీంతో మందులు పాడవుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో సిరంజ్లూ లేవు. డ్లైకోపినాక్, పారాసిట్మాల్లాంటి మాత్రలు లేవు. కురబలకోట పీహెచ్సీలో కుక్క, పాముకాటు నివారణ మందులు లేవు. సిరంజ్‌లు బయట నుంచి తెచ్చుకోమని చీటీలు రాసిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు ఉన్నాయి. అవసరమైన మందులు ఉన్నాయి. ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైద్యవిధాన పరిషత్ అధికారులు స్పందించారు. తిరుపతి నుంచి చాలా మందులు తెప్పించారు. పెద్దపంజాణి మండలంలో డైక్లోపినాక్ మాత్రల కొరత ఉంది. నగరి నియోజకవర్గంలో ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు పీహెచ్‌సీలు, ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. అన్నిచోట్లా మందు లు ఉన్నాయి. సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో పారాసిట్మాల్ మాత్రలు, అనస్తీషియా ఇంజక్షన్లు లేవు. పీలేరు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు ఉన్నా యి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు. -
ఇంజినీరింగ్ విద్యపై తగ్గిన మోజు
రానురాను ఇంజినీరింగ్ విద్యపై మోజు తగ్గుతోంది. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో ఆ ప్రభావం ఇంజినీరింగ్ కళాశాలలపై పడుతోంది. ఎంసెట్-13 ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ పూర్తికాగా కన్వీనర్ కోటాలో జిల్లాలో ఉన్న కళాశాలల్లో 8664 సీట్లకు గాను 4165 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యలో చేరేవారి సంఖ్య భారీగా పడిపోతుంది. ఎంసెట్-2013 రెండవ విడత కౌన్సెలింగ్ కూడా మూడురోజుల క్రితమే పూర్తయింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో ఆ ప్రభావం ఇంజినీరింగ్ కోర్సులపై పడింది. ముఖ్యంగా సీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్య ఘోరంగా పడిపోయాయి. జిల్లాలోని చాలా కాలేజీల్లో ఈ కోర్సులో చేరిన వారి సంఖ్య పదికి మించలేదు. ఈ సంవత్స రం ఇంజినీరింగ్ కోర్సుల్లో బాగా చేరింది సివిల్ విభాగంలోనే. అనేకకాలేజీల్లో సివిల్సీట్లు72 శాతం భర్తీ అయ్యాయి. దాంతో ఈ విభాగం ప్రథమస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో మెకానికల్, సీఈసీ, ఈఈఈ కోర్సులున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో కేవలం 22 శాతం అడ్మిషన్లే నమోదయ్యాయి. కోదాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ కాలేజీ వారు 42సీట్లతో మైనింగ్ విభాగాన్ని ప్రారంభించగా అందులో ఒకే ఒక్కడు చేరాడు. రాజధాని శివార్లలోని కాలేజీల పరిస్థితి ఒకింత పర్వాలేదనిపించుకోగా, పట్టణ ప్రాంత ఇంజినీరింగ్ కాలేజీల భవిష్యత్తు అయోమయంగా మారింది. 48 శాతం సీట్లే భర్తీ జిల్లాలో మొత్తం 40 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 3 మైనార్టీ కాలేజీలు ఉండగా మిగతా 37 కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటిల్లో కేవలం 48 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఎంసెట్-2013 ద్వారా ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా కన్వీనర్ కోటాలో 8664 సీట్లకు గాను 4165 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 4499 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 52 శాతం సీట్లలో విద్యార్థులు చేరకపోవడం గమనార్హం. పనిచేయని ‘ఉచిత’ మంత్రం ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశంవున్న విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌లో చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో కొన్ని కాలేజీల వారు ‘ఆల్‌ఫ్రీ’ అనే ఉచిత మంత్రం వేసినా అడ్మిషన్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. యూనివర్సిటీ ఫీజు చెల్లించకుండా తామే చూసుకుంటామని, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా హాస్టల్, భోజనం వసతులు కల్పిస్తామని ప్రచారం చేసుకున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల వారు ఏజెంట్లను నియమించుకొని విద్యార్థులను చేర్పిస్తే నగదు బహుమతులు కూడా ఇచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కన్వీనర్ కోటాలోనే సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. ప్రవేశాలు తగ్గడానికి కారణాలు ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో జిల్లాకు చెందిన వందలమంది విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీల్లో, మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరిపోయారు. అనేక ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభించినా కొన్నింటిలో సరైన వసతులు లేవు. నైపుణ్యం, బోధనానుభవం గల అధ్యాపకులు లేరు. అనుభవం కలిగిన అధ్యాపకులు రెండుమూడేళ్లు రూరల్ ఏరియాలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేసి, సకాలంలో వేతనాలు అందకపోవడం, తదితర కారణాలతో రాజధాని శివారులోని కాలేజీలకు వెళ్లిపోతున్నారు. అడ్మిషన్ల విషయంలో ఈ సంవత్సరం నాణ్యతలేని, మంచి ఫ్యాకల్టీ లేని కాలేజీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గుతుండటంతో ఎంసెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌లో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. ఇంజినీరింగ్ కన్నా నైపుణ్యం ఉంటే మామూలు డిగ్రీ చదువులే మేలనే అభిప్రాయానికి తల్లిదండ్రులు రావడంతో డీగ్రీ కోర్సుల్లో చేరిపోతున్నారు.