న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 2018 ఏప్రిల్‌లో 4.7 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు కారణమయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ వృద్ధిరేటు 2.6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆయా రంగాలను వేర్వేరుగా చూస్తే...
వృద్ధి అప్...4
బొగ్గు: 2017 ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా –3.3% క్షీణత నమోదయ్యింది. ఈ ఏప్రిల్‌లో ఏకంగా 16% వృద్ధి నమోదయ్యింది.
సహజ వాయువు: వృద్ధి రేటు 2 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది.
సిమెంట్: –5.2 శాతం క్షీణత 16.6 శాతం వృద్ధిలోకి మారింది.
రిఫైనరీ ప్రొడక్టులు: 0.2 శాతం వృద్ధి 2.7 శాతానికి ఎగసింది.
వృద్ధి డౌన్...3
విద్యుత్: వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.
స్టీల్: వృద్ధి 9% నుంచి 3.5 శాతానికి పడింది.
ఎరువులు: 6.2% నుంచి 4.6%కి దిగింది.
క్షీణతలో...1
క్రూడ్ ఆయిల్: –0.6 శాతం క్షీణత మరింతగా క్షీణించి –0.8 శాతానికి పడింది.
ఏప్రిల్ మౌలిక రంగం వృద్ధి 4.7 శాతం
Published Fri, Jun 1 2018 1:10 AM | Last Updated on Fri, Jun 1 2018 1:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment