ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం, భారతీయులకే
మెల్బోర్న్ : భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త వీసా దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి సందర్శన వీసాలను దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియను చేపట్టవచ్చని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ మినిస్టర్ అలెక్స్ హాక్ ఈ విషయాన్ని తెలిపారు. ఆన్ లైప్ దరఖాస్తు విధానంతో తమ దేశ సందర్శన వీసాను అప్లయ్ చేయడం భారతీయులకు చాలా తేలికగా, మెరుగ్గా మారుతుందని చెప్పారు. భారత్ లో ఆస్ట్రేలియా వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతుందని, ఈ డిమాండ్ హాలిడే ప్రాంతాలకు మరింత ఉంటుందని ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
2017 తొలి నాలుగు నెలల్లోనే ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ భారతీయులకు 65వేల వీసాలను జారీచేసిందని పేర్కొంది. ఆస్ట్రేలియాను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ఈ విధానం ఎంతో సహకరించనుందని హాక్ చెప్పారు. 24/7 సౌలభ్యం, వీసా దరఖాస్తు ఛార్జ్ ను ఎలక్ట్రిక్ పేమెంట్ చేయడం, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశం వంటి ప్రయోజనాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వీటన్నింటిన్నీ డిపార్ట్ మెంట్ ఇమ్మిఅకౌంట్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోగలిగినా వెంటనే వీసాను తుది ఆమోదిస్తామని, భారతీయ దరఖాస్తుదారులు వెంటనే ప్రయాణ ఏర్పాట్లకు సంసిద్ధం కావచ్చని పేర్కొన్నారు.