బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తొలగింపు | Bank of Maharashtra divests CEO and executive director of their powers | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తొలగింపు

Published Sat, Jun 30 2018 12:24 AM | Last Updated on Sat, Jun 30 2018 12:24 AM

Bank of Maharashtra divests CEO and executive director of their powers - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) తాజాగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.పి.మరాఠే, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.కె.గుప్తాలను పదవుల నుంచి తొలగించింది. బ్యాంక్‌ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.సి.రౌత్‌.. మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని బ్యాంక్‌ పేర్కొంది. పుణే పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరాఠే, గుప్తాలను రూ.2,043 కోట్ల స్కామ్‌కు సంబంధించి చీటింగ్‌ కేసు కింద అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బెయిల్‌ మీద బయటకు వచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement