ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ నుంచి రూ.5,000 కోట్ల రీట్‌ | Blackstone, Embassy file for Rs 5000 crore REIT | Sakshi
Sakshi News home page

ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ నుంచి రూ.5,000 కోట్ల రీట్‌

Published Tue, Sep 25 2018 12:43 AM | Last Updated on Tue, Sep 25 2018 12:43 AM

Blackstone, Embassy file for Rs 5000 crore REIT - Sakshi

న్యూఢిల్లీ: రీట్‌ (రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) ద్వారా రూ.5,000 కోట్ల సమీకరణకు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కంపెనీలు కలసి ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీ రీట్‌ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ఆఫర్‌ డాక్యుమెంట్‌ను ఈ జేవీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

ఇదే మన దేశపు తొలి రీట్‌  కానుంది. ఈ రీట్‌ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించాలని, వీలైతే అదనంగా మరో 25 శాతం నిధులను కూడా సమీకరించాలని ఈ జేవీ యోచిస్తోంది. ఈ రీట్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్‌ పరిస్థితులు, వివిధ సంస్థల ఆమోదాల లభ్యతను బట్టి ఈ రీట్‌ ఎప్పుడు వచ్చేది ఆధారపడి ఉంటుంది. అద్దెలు వచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను నిర్వహించే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్‌గా రీట్‌ను చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్‌ ఎవరైనా ఈ ప్లాట్‌ఫార్మ్‌పై ఇన్వెస్ట్‌ చేసి ఆదాయం పొందవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement