బీఎండబ్ల్యూ ‘3జీటీ’ @ రూ.47.5 లక్షలు | BMW 3 Series Gran Turismo Launched at Rs 43 Lakh | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ ‘3జీటీ’ @ రూ.47.5 లక్షలు

Oct 20 2016 12:38 AM | Updated on Sep 4 2017 5:42 PM

బీఎండబ్ల్యూ ‘3జీటీ’ @ రూ.47.5 లక్షలు

బీఎండబ్ల్యూ ‘3జీటీ’ @ రూ.47.5 లక్షలు

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో (జీటీ) మోడల్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో (జీటీ) మోడల్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర శ్రేణి రూ.43.3 లక్షలు-రూ.47.5 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేసింది. ఇది డీజిల్, పెట్రోల్ వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది. అలాగే వినియోగదారులు ఈ మోడల్‌ను స్పోర్ట్ లైన్, లగ్జరీ లైన్ అనే రెండు వేరియంట్లలో పొందొచ్చు. 3జీటీ స్పోర్ట్‌లో 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.

దీని ధర రూ.43.3 లక్షలుగా ఉంది. ఇక డీజిల్ 3జీటీ లగ్జరీ వేరియంట్ ధర రూ.46.5 లక్షలుగా ఉంది. పెట్రోల్ 3జీటీ లగ్జరీ వేరియంట్ ధర రూ.47.5 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ స్పేర్ వీల్, వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement