‘బాడీకేర్’ బ్రాండ్కు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్ : ప్రముఖ లో దుస్తుల కంపెనీ ‘బాడీకేర్’కు అంతర్జాతీయంగా బ్రాండ్ పాపులారిటీ పెరుగుతోంది. వినూత్నమైన టెక్నాలజీలతో అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ఆదరణను పెంచుకుంటున్నామని బాడీకేర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదికి 15 లక్షల డజన్ల లో దుస్తులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించింది.
కొత్త తరం ఫ్యాబ్రిక్స్‌తో నేటి తరం పోకడలకు అనుగుణంగా ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపింది. భారత్‌లో మూడు పూర్తి స్థాయి ఆటోమేటెట్ ప్లాంట్లలో, పూర్తిగా దిగుమతి చేసుకున్న యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. తొలి టెఫ్లాన్ ఫినిష్, లైక్రా స్ట్రెచ్, పోర్సియన్ ప్రింట్ ప్యాంటీలను అందించిన ఘనత తమదేనని పేర్కొంది. సీఎంఏఐ నుంచి 2006, 2007, 2009ల్లో బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌లను గెల్చుకున్నామని వివరించింది.