మేకిన్ ఇండియాకు డిమాండ్ కీలకం: రాజన్
చండీగఢ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశీయంగా తగినంత డిమాండ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయంగా విదేశీ కంపెనీలతో దీటుగా పోటీపడేలా దేశీ సంస్థలకు తోడ్పాటునివ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు మేకిన్ ఇండియాను ఉపయోగించుకోవచ్చని రాజన్ పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు.